Governor of Haryana: నిర్మల్, ఫిబ్రవరి 10 (మన బలగం): హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను చండీగఢ్‌లోని హర్యానా రాజ్ భవన్‌లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు రావుల రామ్ నాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయను ఘనంగా సన్మానించి తెలంగాణలో పార్టీ పరిస్థితి, రాష్ట్ర అభివృద్ధి తదిత రాంశాలపై ఇరువురు చర్చించారు. అనంతరం గవర్నర్ దత్తాత్రేయ రావుల రామ్‌నాథ్‌ను హర్యాన రాజ్ భవన్‌కు మొదటిసారిగా వచ్చినందున ఘనంగా శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
