Bail for indigent prisoners
Bail for indigent prisoners

Bail for indigent prisoners: ఆర్థిక స్తోమతలేని ఖైదీలకు బెయిల్

Bail for indigent prisoners: నిర్మల్, అక్టోబర్ 29 (మన బలగం): వివిధ నేరాల కింద జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారు బెయిల్ పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ పూచీకత్తు ఇచ్చేందుకు ఆర్థికతో స్తోమత లేక జైల్లోనే మగ్గిపోతున్న వారి వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా ఎంపర్డ్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని జైళ్లలో వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తూ, బెయిల్ పొందడానికి అర్హత ఉన్నప్పటికీ, బెయిల్‌కు సంబంధించిన పూచీకత్తు చెల్లించే ఆర్థిక స్తోమత లేని ఖైదీల కుటుంబసభ్యులకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా ఎంపవర్డ్‌మెంట్ కమిటీ సెక్రటరీ జి.రాధిక, డీఎస్పీ గంగారెడ్డి, జిల్లా జైలు సూపరింటెండెంట్ సీహెచ్ చిరంజీవి, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *