Marriage of Goda Ranganayakas: ఇబ్రహీంపట్నం, జనవరి 11 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో అతి పురాతన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గోదావరి రంగ నాయకుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 27వ రోజు వేదార్చకులు తిరుమలగిరి శ్రీ కొండమాచార్యులు, సామజి నవిన్ చార్యులు శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ, గోదరంగనాయకుల ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగించారు. ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మండపానికి బాజా భజంత్రీలతో ఎదుర్కొని వచ్చారు. అనంతరం స్వామివార్లకు స్వస్తి పుణ్యహ వచనము, జిలకర బెల్లం, యజ్ఞోపవీతం, బాసికధారణ అనంతరం స్వామివారి కళ్యాణం కనుల పండువగా నిర్వహించారు.
స్వామివారి ఎదుర్కోలు మహోత్సవంలో భాగంగా అర్చకులు, గ్రామస్తులు నృత్యాలు చేసారు. అనంతరం మహిళలు స్వామివారికి, అమ్మవారికి ఒడిబియాన్ని సమర్పించారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బర్మ మల్లయ్య, సహకారసంమ చైర్మన్ అంకతి రాజన్న, తాజామాజీ సర్పంచ్ సున్నం నవ్యశీ, మాజీ ఎంపీటీసీ పెంట లక్ష్మీ, నాయకులు సున్నం సత్యం, పెంట లింబాద్రి, నాంపల్లి వెంకటాద్రి, అరె రమేశ్, ఆలయకమిటీ సభ్యులు సున్నం భుమన్న, రాధారపు దేవదాస్, కోటగిరి శ్రీనివాస్, గుడ్ల శ్రీకాంత్, కత్రోజ్ సాయికృష్ణ, అరె నరేందర్, బర్కం సత్యం, ఎడిపెల్లి భూమన్న తదితరులు పాల్గొన్నారు.