Mahaharati to Godavari in Dharmapuri
Mahaharati to Godavari in Dharmapuri

Mahaharati to Godavari in Dharmapuri: ధర్మపురిలో గోదావరికి మహాహారతి

Mahaharati to Godavari in Dharmapuri: ధర్మపురి, నవంబర్ 2 (మన బలగం): కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకొని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మపురి గోదావరి వద్ద శనివారం రాత్రి మహాహారతి నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. వేదపండితులతో కలిసి శాస్ర్తోక్తంగా హారతి ఇచ్చారు. అనంతరం విప్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. పవిత్ర కార్తీక మాసంలో ధర్మపురి పుణ్య క్షేత్రంలో నిర్వహించే మహా హారతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలపై గోదావరి నదీమతల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపా కటాక్షాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ అధికారులు, అర్చకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *