- ఏటీఎంల దగ్గర నిఘా పెట్టాలి
- భద్రతా పరమైన సూచనలకు సంబందించిన పోస్టర్లు అతికించాలి
Review of security of banks: నిర్మల్, జనవరి 20 (మన బలగం): జిల్లాలో ఒక్క బ్యాంకులోనూ దొంగతనం జరుగవద్దనే ముఖ్య ఉద్దేశ్యంతో అన్ని బ్యాంకుల అధికారులతో పటిష్ట భద్రత పరమైన చర్యల నిమిత్తం జిల్లా ఎస్పీ జి.జానకి షర్మిల అధ్యక్షతన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బ్యాంక్ అధికారులతో మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఖాతాదారులతో లావా దేవీలు నిర్వహిస్తున్న వివిధ శాఖలకు చెందిన ఆయా బ్యాంకులు భద్రత చర్యలను పటిష్ట పరచుకోవాలని ఎస్పి అన్నారు. పోలీస్ అధికారులందరూ వారి వారి పరిధిలోని మండల కేంద్రంలోని వివిధ శాఖలకు చెందిన బ్యాంకులను ఆకస్మాత్తుగా సందర్శించాలని, బ్యాంకు పరిసర ప్రాంతాలను, బ్యాంకు లాకర్లను వాటి పనితీరును ఆయా బ్యాంకుల మేనేజర్లు సిబ్బందిలతో కలిసి పరిశీలించాలని ఆదేశించారు. బ్యాంకుల భద్రత చర్యలపై మేనేజర్ అకౌంటెంట్ సిబ్బందికి ఆమె తగు సూచనలు సలహాలు చేశారు. ప్రతిరోజు బ్యాంకు మూసి వేసేముందు లాకర్లు వాటి అలారమ్ సిస్టమ్ సరిగా పనిచేస్తున్నాయా లేదా, పటిష్టంగా ఉన్నాయా లేదా, బ్యాంకు నగదు లావాదేవీలు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణలో సరిచూసుకోవాలి. రుణగ్రస్తులు, తమ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం నిల్వలు పర్యవేక్షణ చేస్తూ సరిచూసుకోవాలన్నారు. అదేవిధంగా ఏటీఎం వద్ద సీసీ కెమెరాలు అన్ని దిక్కుల ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
ముఖ్యంగా ఏటీఎంలలో అలారమ్ సిస్టమ్ పని చేస్తుందా లేదా అని ఎప్పటి కప్పుడు తనిఖీ చేసుకోవాలి. ఇటీవల నిర్మల్ పట్టణంలో ఒక వ్యక్తి ఏటీఎంలో దొంగతనానికి పాల్పడితే ఆ బ్యాంకు మేనేజర్‌కు అలారమ్ రావటంతో వెంటనే తను డైల్ 100కు కాల్ చేయటం వల్ల అట్టి దొంగతనానికి మా పెట్రోలింగ్ అధికారులు ఆపటమే కాకుండా దొంగని కూడా పట్టుకోవటం జరిగిందని గుర్తు చేశారు. బ్యాంకులలో సీసీ కెమెరాలు నిత్యం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్ శాఖ అనునిత్యం తమకు అందుబాటులో ఉండి భద్రత చర్యలను పర్యవేక్షిస్తుందని, బ్యాంకుల పరిధిలో ఏమైనా భద్రత సమస్యలు తలెత్తుతే పోలీసు శాఖ వారికి సమాచారం ఇచ్చి భద్రత చర్యలను కట్టుదిట్టం చేసుకోవాలని అన్నారు. మీ బ్యాంక్ పరిసర ప్రాంతాలలో నివసించే వారి పైన అనుమానాస్పదంగా ఉంటే మీ దగ్గరలోని పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిత్యం ప్రజారక్షనే ద్వేయంగా. ప్రజల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ తమ ప్రాణాలు ఫణంగా పెట్టి భద్రత కల్పించడమే నిర్మల్ పోలీసుల లక్ష్యమన్నారు. అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు సంచరించినట్లయితే పోలీస్ శాఖ వారికి సమాచారం అందించాలని కోరారు. చివరగా బ్యాంకులో ఎక్కువ మొత్తంలో నగదు డ్రా చేసి తీసుకువెళ్లే వారికి బ్యాంక్ అదికారులు భద్రత పరమైన సూచనలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, రాజేశ్ మీన, జిల్లాలోని ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐ, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, జిల్లాలోని అన్ని బ్యాంకుల అదికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
