- అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
- త్వరితగతిన పరిష్కారానికి ఆదేశాలు
- కలెక్టర్ ఆదేశాల మేరకు దివ్యాంగులకు పరికరాల అందజేత
Prajavani: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 3 (మన బలగం): జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 108 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ శాఖకు 45, మున్సిపల్ సిరిసిల్ల 14, జిల్లా సంక్షేమ శాఖ, ఉపాధి కల్పన శాఖ, ఎస్‌డిసికి ఆరు చొప్పున,
విద్యాశాఖకు 5 , ఎస్పీ ఆఫీస్‌కు 4, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, ఎంపీడీవో తంగళ్ళపల్లికి మూడు చొప్పున, డి ఆర్ డి ఓ, రిజిస్టర్, సెస్‌కు 2 చొప్పున, సర్వేశాఖ, ఆర్ అండ్ బి, జిల్లా పౌరసరఫరాల శాఖ, సిపిఓ డిపిఓ, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఎస్సీ కార్పొరేషన్‌కు ఒకటి చొప్పున వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు పరికరాల అందజేత
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఇద్దరు దివ్యాంగులకు పరికరాలు అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన దాసరి పవన్ అనే బాలుడు పుట్టుకతోనే నడవలేని స్థితిలో ఉన్నాడు. తనకు వీల్ చైర్ ఇప్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు విన్నవించాడు. తనకు మ్యానువల్ ట్రై సైకిల్ ఇప్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వేములవాడలోని సాయి నగర్‌కు చెందిన లేదేళ్ల రమేష్ విన్నవించాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు దాసరి పవన్‌కు వీల్ చైర్, లేదేళ్ల రమేష్‌కు మ్యానువల్ ట్రై సైకిల్, సంక కర్ర జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అందజేశారు. తమకు వీల్ చైర్, ట్రై సైకిల్ అందించి, ఆదుకున్న కలెక్టర్‌కు వారు ఇద్దరు కృతజ్ఞతలు తెలిపారు.