Intermediate student suicide in Khanapur, Nirmal district: ఇంటర్ మెదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్ నంది గ్రామానికి చెందిన కొండవీని శ్రావణ్ (17) అనే ఇంటర్మిడియట్ చదువుతున్న విద్యార్థి మంగళవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా కుటుంబంలో విషాదం నెలకొంది. ఎస్ఐ రాహుల్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు శ్రావణ్ మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి లోపలికి వెళ్లి లోపల నుంచి తలుపు పెట్టుకొని బెడ్ రూమ్‌లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. కొద్ది సమయం తరువాత మృతుడి తమ్ముడైన కొండవీని సాత్విక్ బయట నుంచి తలుపులు కొట్టాడు. ఎంతసేపైనా తలుపు తెరువక పోవటంతో, కిటికీ నుంచి ఇంటి లోపలికి వెళ్లి చూడగా ఉరి వేసుకొని కనబడ్డాడు. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో కిందికి దించి చూడగా ఉరి వేసుకున్న యువకుడు అప్పటికే చనిపోయడు.
శ్రావణ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కరీంనగర్ లోని డిఫెన్స్ కాలేజీలో అడ్మిషన్ చేయగా అక్కడ హాస్టల్లో మూడు నెలల క్రితం డోలో 650 ఎంజీ టాబ్లెట్స్ మింగి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని, తర్వాత ఆ యువకుడి తల్లిదండ్రులు అతనిని ఆ కాలేజీ నుంచి తీసివేసి నిర్మల్‌లోని వశిష్ట కాలేజీలో జాయిన్ చేసారని, ప్రస్తుతం నిర్మల్‌లోని వశిష్ట కాలేజీలో అతను చదువుకుంటున్నాడని, ప్రతి చిన్న విషయమై తల్లిదండ్రులపై గొడవ పడుతూ, కోపం చూపేవాడని, అలాగే సైకోటిక్ బిహేవియర్, సూసైడ్ టెండెన్సీ కలదని తెలిపారు. ఉదయం మృతుడి అతని తండ్రి ఒక యూరియా బస్తా తీసుకొని పొలంలో వేసి రమ్మని చెప్పగా కోపంగా నేను ఎందుకు పనిచేయాలని తన తండ్రితో గొడవపడ్డడని, ఆ తర్వాత తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్ళగా ఇంట్లో ఎవరు లేని సమయంలో గదిలో గల సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.