Coins of Aurangzeb: ముధోల్, ఫిబ్రవరి 8 (మన బలగం): నిర్మల్ జిల్లా ముధోల్‌లోని మహాలక్ష్మి గల్లీకి చెందిన లూటే మారుతి పటేల్ ఇంటి నిర్మాణ పనులను శుక్రవారం చేపట్టారు. పునాది కోసం తవ్వుతుండగా మట్టికుండలో 92 పురాతన నాణేలు లభ్యమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్సై సంజీవ్, తహసీల్దార్ శ్రీకాంత్ అక్కడికి చేరుకొని తవ్వకాల్లో బయటపడ్డ నాణేలను పరిశీలిం చారు. 92 నాణేలను జిల్లా ఖజానా కార్యాలయానికి జమ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీవో జయరామ్, ఆర్ఐ సత్యనారాయణ ఉన్నారు. నాణేలను పరిశీలించిన అధికారుల ఔరంగజేబు కాలం నాటివిగా గుర్తించారు.