విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో ఓటరు ప్రతిజ్ఞ
నూతనంగా ఓటు హక్కు పొందిన ఓటర్లకు కార్డులు అందజేత
National Voter’s Day: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, జనవరి 26 (మన బలగం): వీర్నపల్లి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఎంఈఓ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీవో వాజిద్, ఏవో జయ, సెస్ డైరెక్టర్ మల్లేశం, ఏఎంసీ చైర్మన్ రాములు, వైస్ చైర్మన్ లక్ష్మణ్, మాజీ సర్పంచ్ దినకర్, నాయకులు చంద్రమౌళి, తిరుపతి నాయక్, కాంతయ్య, మల్లేశం యువకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. చదువుకున్న యువత ఓటర్లుగా ఉన్నప్పుడే సరైన నాయకత్వం దేశానికి అందుతుందని, 18 సంవత్సరాలు పూర్తయిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఓటు హక్కు పొందిన వారికి ఓటరు కార్డులు అందజేశారు.
