ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
ప్రతిజ్ఞ చేసిన ఉద్యోగులు, సిబ్బంది
National Voter’s Day: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, జనవరి 26 (మన బలగం): ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే థీమ్‌తో 15వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఉద్యోగులు భారతదేశ పౌరులమయిన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామనీ, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతీ ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఓటర్ నమోదు పెంపు, ఎథికల్ ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తామని, ఈ సంవత్సరం నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే థీమ్‌తో వేడుకలు జరుగుతున్నాయని వివరించారు.
విద్యార్థులకు బహుమతులు
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా పలు విద్యాసంస్థల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు కలెక్టర్, అదనపు కలెక్టర్ పంపిణీ చేశారు. వ్యాస రచన పోటీల్లో ఈ చైతన్య, కే నికిత, జీ హరిక, సీహెచ్ రోహిత్, సాయి కృష్ణ, కే రాంచరణ్, ఈ ప్రేమ్ కుమార్ విజేతలుగా నిలువగా, బహుమతులు అందజేసి, అభినందించారు.
సీనియర్ ఓటర్లకు సన్మానం
ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న ఎలగందుల బుచ్చయ్య, రదేంశ్ భారతి, అలాగే ట్రాన్స్ జెండర్ కౌసల్యను
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ శాలువాతో సన్మానించారు.
నూతన ఓటర్లకు కార్డుల అందజేత
నూతనంగా ఓటరుగా నమోదు అయిన సుద్దాల హర్షవర్ధన్, సుంకనపల్లి స్వాతి, జక్కని ధనుష్, దూడం అఖిల, తోట ప్రసన్నాంభికకు నూతన ఎపిక్ కార్డులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అందజేసి, అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్, ఎస్డీసీ, సిరిసిల్ల ఇన్చార్జి ఆర్డీవో రాధా భాయ్ ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తధాంతరం
సిరిసిల్లలో ర్యాలీ
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ముందుగా ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో ఎస్డీసీ, సిరిసిల్ల ఇన్చార్జి ఆర్డీవో రాధా భాయ్, తహసిల్దార్ ఉమారాణి, అధికారులు, సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.