Iftar dinner: నిర్మల్, మార్చి 22 (మన బలగం): పవిత్ర రంజన్ మాసాన్ని పురస్కరించుకుని ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ట్రస్మాలో గల తోటి ముస్లిం సోదర స్కూల్ కరెస్పాండెంట్‌లకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ట్రస్మా నిర్మల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బాస్, నిర్మల్ జిల్లా టౌన్ ప్రెసిడెంట్ అయ్యనగారి శ్రీధర్, జిల్లా సెక్రటరీ శ్యామ్ ప్రకాష్, స్టేట్ ఈసీ మెంబర్ షబ్బీర్ మరియు ముస్లిములు పాల్గొన్నారు.