Nirmal Polytechnic Students: నిర్మల్, మార్చి 22 (మన బలగం): ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యుత్ విభాగ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పాలిటెక్నిక్ విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ కనబర్చారు. ప్రజలు ప్రయాణిస్తున్న సమయంలో వెహికల్‌కు ప్రమాదం జరిగితే తక్షణ సహాయానికి ఆటోమేటిక్‌గా బంధువులకు, పోలీస్ శాఖకు, మరియు ఇతర సహాయ సంస్థలకు ప్రమాదం జరిగిన స్థలం, సమయం, వాహన చోదకుల పరిస్థితి, మరియు ఇతర సమాచారం చేరవేసేందుకు విద్యార్థులు రూపొందించిన నమూనాకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. ఈ నమూనా వాహనదారులకు ప్రమాద సమయంలో తక్షణం వైద్య సహాయం అందించి ప్రాణాలు కాపాడుటకు ఎంతో ఉపయోగ పడుతుందని విద్యార్థులు తెలిపారు. మార్గదర్శకురాలు (మెంటర్) పొలాస స్వాతి, విద్యుత్ విభాగ అధిపతి, మరియు విద్యార్థులకు ప్రిన్సిపాల్ డాక్టర్ టి.రమేశ్ అభినందనలు తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లో జరిగే ప్రతిభ దినోత్సవం రోజు బహుమతి రూపమున రూ.25 వేలు విద్యార్థులకు రాష్ట్ర సాంకేతిక శాఖ కమిషనర్ అందజేస్తారని ప్రిన్సిపాల్ తెలియజేశారు.
