Khanapur MLA Bozzu Patel inspects Jyothi Bapule School in Nirmal district: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని గల మహాత్మా జ్యోతి బాఫూలే బాలుర పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్ రూమ్ను, వంటలను పరిశీలించారు. ప్రతి తరగతి గదిని తిరిగారు. విద్యార్థులతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని, పలు సూచనలు చేశారు. విద్యను పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధించాలని చెప్పారు. విద్యార్థులందరితో కలిసి ఉదయం అందించే టిఫిన్ చేశారు. చదువు పట్లనిర్లక్ష్యం చేయవద్దని, క్రమశిక్షణతో ఉండాలని, పట్టుదలతో చదువుకుంటే భవిష్యత్ ఉంటుందని పిల్లలకు చెప్పారు. 10వ తరగతి స్టూడెంట్‌ను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.