Indiramma housing sanction papers distribution by MLA Bozzu Patel in Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ లబ్ధిదారులకు అందజేశారు. పట్టణంలోని 2వ వార్డు శివాజీనగర్ కాలనికి చెందిన మునుగురి సుజాత, శ్రీహరిలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇండ్లు లేని పేదలందరికి ఇవ్వటం జరుగుతుందని, ప్రజా ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం జరగదని, ఇండ్లను నాణ్యతగా, నిర్మాణం చేయాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుజాత, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.