- అజ్ఞాత వ్యక్తిపై మహిళల ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన టౌన్ సీఐ
Indecent photos of women: జగిత్యాల ప్రతినిధి, జనవరి 11 (మన బలగం): జనసమూహంలోని మహిళల శరీర భాగాలను ఫొటోలు తీస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్న అజ్ఞాత వ్యతిపై కొందరు మహిళలు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు జగిత్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ వేణు గోపాల్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని మార్కెట్, షాపింగ్, బస్టాండ్ ప్రాంతాల్లో బిజీగా ఉండే ప్రాంతాల్లో మహిళల శరీర భాగాలను దొంగ చాటుగా అశ్లీలంగా ఫొటోలు తీసి వీటిని ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత మహిళల ఫిర్యాదుతో థింగ్స్ ఎన్ లెగ్గిన్స్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్న అజ్ఞాత వ్యక్తిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని టౌన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.