Ratnakar Rao’s birth anniversary: ధర్మపురి, అక్టోబర్ 4 (మన బలగం): రైతు సంక్షేమమే ధ్యేయంగా కృషి చేసిన మహనీయుడు మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు అని, ఆయన ఆలోచన విధానాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడే అదే వారికి మనం ఇచ్చే ఘన నివాళి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. రత్నాకర్ రావు జయంతి సందర్భంగా శుక్రవారం ధర్మపురిలోని ఆయన విగ్రహానికి పూలమల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రత్నాకర్ రావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓడిన తనకు ఎంతో ధైర్యాన్ని అందించిన మంచి వ్యక్తి అని తెలిపారు. రైతుల అభివృద్ధి, ఏ పంటలు వేస్తే అధిక లాభాలు పొందుతారు అని సూచించడంతోపాటు రైతుల గురించి ఆలోచించే గొప్ప నాయకుడు రత్నాకర్ రావు అని తెలిపారు. సాగు, తాగునీటి కోసం ఆయన చేసిన కృషి చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు