Gaon, Basti Chalo: మల్యాల, ఏప్రిల్ 11 (మన బలగం): రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గావ్ బస్తీ చలో అభియాన్ బీజేపీ మల్యాల మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో 11 గ్రామాల్లో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. గాజుల మల్లేశం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రతి గల్లీలో ప్రతి ఇంటి లోపలికి తీసుకెళ్లే ప్రజలకు వివరించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా 19 గ్రామాలకు గాను 19 ఇన్చార్జిలను పెట్టి అన్ని గ్రామంలోకార్యక్రమం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మద్దుట్ల గ్రామంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని కూడా ఘనంగా నిర్వహించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం. అన్ని మతాల కులాల ప్రజలకు న్యాయం కోసం సామాజిక ఉద్యమం చేసిన మహాత్మ జ్యోతిబాపూలే అన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పొన్నం సాయికుమార్ గౌడ్. మాజీ మండల అధ్యక్షుడు నేరెళ్ల శ్రావణ్. బొట్ల ప్రసాద్. మాజీ ఎంపీటీసీలు సంఘని రవి. కో కన్వీనర్లు నులుగోoడ సురేష్. కొక్కెర మల్లేశం యాదవ్.. కిల్లేటి రమేష్. కొణిదెల రాజన్న. రాచర్ల రామన్న. లక్ష్మారెడ్డి. బొమ్మిన పరమేష్. గడ్డం చిన్న మల్లేశం. నాగరాజ్. పంబాల గంగాధర్. నడిపి మల్లేశం. నుల్గొండ అంజి. గడ్డం నాగరాజ్. రాజశేఖర్. సాయి. బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.