Maha Shivratri celebrations
Maha Shivratri celebrations

Maha Shivratri celebrations: బుగ్గారంలో ప్రారంభమైన మహా శివరాత్రి ఉత్సవాలు: శ్రీ సాంబ శివ నాగేశ్వరాలయంలో రుద్రాభిషేకం

Maha Shivratri celebrations: బుగ్గారం, ఫిబ్రవరి 24 (మన బలగం): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని సాంబుని గుట్టపై గల సంతాన సాఫల్య శ్రీ సాంబ శివ నాగేశ్వర ఆలయంలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ మసర్థి రాజిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమయ్యాయి. శివ దీక్షా స్వాములు, భక్తులు హాజరై స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు. ఈ నెల 25 మంగళవారం ఉదయం మాతలచే కుంకుమ పూజ, గీతా హవన యజ్ఞం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 26న బుధవారం ఉదయం మహా రుద్రాభిషేకం, మహా శివరాత్రి జాతర, సాయంత్రం గోధూళి సుముహూర్తమున శివ పార్వతుల కళ్యాణం ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 27న గురువారం మధ్యాహ్నం 12.05 గంటలకు నుంచి రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు, శివ దీక్షాపరులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, వివిధ పార్టీల నేతలు అధిక సంఖ్యలో పాల్గొని మహా శివరాత్రి జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని చైర్మన్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *