TB Awareness and Free Health Screening under TB Mukt Bharat Abhiyan in Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడివీ పధిర పీహెచ్ ఎల్లారెడ్డిపేటలో క్షయ వ్యాధి అవగాహనపై టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం మరియు ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి డాక్టర్ సారియా అంజూమ్ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ గర్జనపల్లి ఉప ఆరోగ్యకేంద్రలో నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టీబీ సూపర్‌వైజర్ మహిపాల్ మాట్లాడుతూ ఇందులో షుగర్, క్యాన్సర్, బీపీ, దీర్ఘకాలిక వ్యాధులు, పొగాకు తీసుకునే వారిలో క్షయ వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయని, క్షయ లక్షణాలు.. రెండు వారాలు మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం.. ఉన్న వారు తెమడ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.
టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో 83 మందికిపైగా టీబీ స్క్రీనింగ్ చేశామని 28 మంది అనుమానితుల నుంచి తేమడ నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించమన్నారు. 13 మంది సింటమేటిక్ వాళ్లని, ఎక్సరేకు సిరిసిల్ల మెడికల్ కాలేజ్ రేడియాలజీ ల్యాబ్‌కు రెఫర్ చేసామని, అందులో క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారికి 6 నెలల పాటు పూర్తి ఉచితంగా పరీక్షలు, మందులు ఇస్తామన్నారు. అలాగే నిక్ష్యయ్ పోషన్ ద్వారా వ్యాధిగ్రస్తుతులకు నెలకి రూ.1000 పౌష్టికాహారం కోసం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సారియా అంజూమ్, టీబీ సూపర్‌వైజర్, జి.మహిపాల్ (ఎస్‌టీఎస్), హెచ్‌సీ పద్మ, ఎంఎల్‌హెచ్‌పీ ఆకాశ్, ఎన్ఎం మంజుల, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.