- కవ్వాల అభయారణ్యం పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద
- వాహనాలను అడ్డుకోవద్దని పీసీసీఎఫ్‌కు మంత్రి కొండా సురేఖ ఆదేశం
Minister Konda Surekha: కడెం, ఫిబ్రవరి 4 (మన బలగం): కవ్వాల అభయారణ్యం పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారు ఆరు గంటల వరకు వాహనాల రాకపోకలను అడ్డుకొంటున్న అటవీ అధికారుల చర్యలకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అడ్డుకట్ట వేశారు. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలను అడ్డుకోవద్దని సంబంధిత జిల్లాల అటవీ అధికారుకారులకు సూచనలు జారిచేయాలని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వెటర్‌ను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంత్రి కొండా సురేఖను కలిసి రాత్రి వేళల్లో అటవీ చెక్ పోస్టుల వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి ఎఫ్డీపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే ప్రాతినిద్యంపై స్పందించిన మంత్రి ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు అనుమతించాలని పీసీసీఎఫ్‌కు ఆదేశించారు.