- యూపీఎస్‌ను అడ్డుకోవాలంటే ఇన్నారెడ్డిని ఆశీర్వదించండి
- సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ
MLC elections: జగిత్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 4 (మన బలగం): ఫిబ్రవరి 27న జరగనున్న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ బలపరిచిన అభ్యర్థి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డిని గెలిపించాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ కోరారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ కోశాధికారి నరేష్ గౌడ్‌లతో కలిసి కరీంనగర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ, ఏప్రిల్ 1, 2025 నుంచి అమలు అవుతున్న యూపీఎస్ విధానాన్ని అడ్డుకోవడానికి సీపీఎస్ యూనియన్ ఎమ్మెల్సీ బరిలో ఉందని, ఇన్నా రెడ్డి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కష్టపడిన వ్యక్తిని చూడాలని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఇన్నారెడ్డి మాట్లాడుతూ, 37 ఏండ్లుగా ఉపాధ్యాయులకు సేవ చేస్తూ ఉపాధ్యాయుల కష్టం తెలిసిన వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాడని, ఉపాధ్యాయుల పెన్షన్ విధానాన్ని కార్పొరేటికరించిన వారున్నారని, ఒక వైపు స్థిరాస్తి వ్యాపార విస్తరణ కొరకు మరో వైపు వస్తున్నారని ఉపాధ్యాయుల కష్టనష్టాలు తెలిసిన ఇన్నారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో రవికుమార్ పాల్గొన్నారు.