Whip Laxman Kumar: ధర్మపురి, జనవరి 7 (మన బలగం): ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై మంగళవారం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ముందు దేవాలయంలో చేపడుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించి, అన్నదాన మరియు దర్శన టికెట్ల కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విప్ లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గ ప్రజలు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గత ఏడాది ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటిని సమీక్షించుకుంటూ తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేద పండితులు, అర్చకుల సూచనల మేరకు, సమయపాలనకు అనుగుణంగా వైకుంఠ ద్వారాలను తెరవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.