ACB Telangana: తెలంగాణ బ్యూరో, మన బలగం: జనవరి నెలలో అవినీతి నిరోధక శాఖ రాష్ర్ట వ్యాప్తంగా దాడులు నిర్వహించి 19 కేసులు నమోదు చేసింది. వీటిలో 10 ట్రాప్ కేసులు, 1 ఆదాయానికి మించి ఆస్తుల కేసు, క్రిమినల్ కేసులు 3, ఇతర 6 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు ఔట్ సోర్సింగ్, ప్రైవేటు ఉద్యోగులు సహా 17 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. పట్టుబడిన ఉద్యోగులు విద్య, రెవెన్యూ, హోం, ఆర్థిక, పశుసంవర్ధక, ఆరోగ్యం తదితర శాఖలకు చెందినవారు ఉన్నారు. ఈ కేసుల్లో రూ.1,45,000 స్వాధీనం చేసుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అక్రమాస్తుల ఆస్తుల కేసులో, రూ.65,50,000 విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 ను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.