Bridal: అప్పుడే పెళ్లై భర్తతో కలిసి అత్తింట్లో అడుగు పెట్టే తరుణంలో ఓ నవ వధువు పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివాహ బంధం విలువలు, కుటుంబ బాధ్యతలు, దాంపత్య జీవితంలో ఎలా మసులుకోవాలో పాట రూపంలో తెలిపింది. అత్తింట్లో ఎలా మెలగాలో వివరించింది. పుట్టినింటి గౌరవాన్ని ఎలా నిలబెట్టాలో పేర్కొంది. తన భర్తను శ్రీరాముడితో పోలుస్తూ.. తను జానకి అయ్యింది. భర్త తోబుట్టువులతో వాదనకు వెళ్లను అంటూ.. తన పరిధులు చెప్పింది. అత్తయ్యకు తోడుగా ఉంటానని చెబుతూ.. తన బాధ్యతలు తెలిపింది. మావయ్య మాటకు ఎదురు చెప్పను అంటూ.. సంస్కారాన్ని గుర్తుచేసింది. పుట్టింటి వారి గురించి చెబుతూ.. వారి మర్యాదను కాపాడుతానని చెప్పింది. అత్తింట్లో ఆనందాలు విలసిల్లేలా చేస్తానని చిరునవ్వులు చిందిస్తూ తెలిపింది. భర్తతో వచ్చిన తమకు హారతి ఇచ్చి ఆహ్వానించండి అంటూ అత్తింటి తరపు వారికి వినయపూర్కంగా విన్నవించింది. అంతేకాకుండా బహుమతులు కావాలంటే తనలోని సగభాగాన్ని అడగండి అంటూ చిలిపిగా చెప్పడంతో అందరి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరిసాయి. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ పాట తెగ వైరల్ అవుతోంది.
వధువు పాడిన పాట ఇదే..
రాముడులాంటి మీ అన్నయ్యకు జానకినవుతాను
వగలమారి వదినమ్మలతో తాగువుకు నే రాను
దేవతలాంటి అత్తయ్యకు నే తోడుగ ఉంటాను
మారులేని మావయ్య మాటకు అడ్డుగా నే రాను
అందాల పెళ్లి ఆనందంగా చేసిన అన్నయ్యకు నేను
అలకలు లేని ఆనందాన్ని ఇచ్చే చెల్లిని అవుతాను
కలతలు లేని కుటుంబానికి వచ్చిన కోడలినే నేను
చందమామా చందమామా హారతి ఇవ్వమ్మా
బహుమతుల కోసం నాలో సగభాగాన్ని అడుగమ్మా..!