Khannapur Government Junior College students attendance discipline: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం పోషకులు, అధ్యాపకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆనందం మాట్లాడుతూ, తల్లి దండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా కళాశాలకు పంపించాలని, తద్వారా విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకొని చదువులో రాణించగలుగుతారని అన్నారు. విద్యార్థులకు సంబంధించిన విద్యాభివృద్ధి, హాజరు, విద్యార్థుల ప్రవర్తనకు సంబంధించిన విషయాలపై తల్లిదండ్రులతో చర్చించారు. తర్వాత ప్రిన్సిపాల్, విద్యార్థులు, పేరెంట్స్, అధ్యాపకులు అలాగే కళాశాల సిబ్బంది కలిసి కళాశాలలో ఆటపాటలతో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. లలిత కుమారి పబ్లిక్ ప్రిపరీస్ ఎన్‌జీవో ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్, ఏఏపీ కమిటీ చైర్‌పర్సన్, సీనియర్ అధ్యాపకులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆనందంతో పాటు, అమ్మ ఆదర్శ కళాశాల కమిటీ చైర్‌పర్సన్ వీణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి క్యాతం సంతోష్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
