Prize distribution: ధర్మపురి, జనవరి 27 (మన బలగం): స్నేహమిత్ర యూత్ జాజాల రమేశ్ ఆధ్వర్యంలో నేరెళ్ల గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న ధర్మపురి ఏఎస్ఐ సూర్యనారాయణ రాజు విన్నర్స్ మడ్డి రంజిత్ టిమ్‌కు రూ.5000 నగదు, రన్నర్స్ జుంజురు నవీన్ టీమ్‌కు రూ.2500 రూపాయల నగదుతో పాటు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, పట్టుదల ఉంటే యువత ఏదైనా సాధించవచ్చని అన్నారు. కొంత మంది యువత గంజాయి డ్రగ్స్ ఇతర చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిసలై వారి శారీరక దృఢత్వన్ని మానసిక ఉల్లాసానికి ఇబ్బందులకు గురవుతున్నారాని, క్రిమినల్ కేసుల పాలై యువకులు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఇంద్రాల మల్లేశం, తాజా మాజీ ఉపసర్పంచ్ జాజాల శేంకర్, గోవిందుపల్లె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురంశేట్టి మల్లేశం, శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ జంగిలి తిరుపతి, గోవిందుపల్లె మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పురంశెట్టి సుధాకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పలిగిరి లచ్చన్న బీజేపీ సీనియర్ నాయకులు కోల రామన్న శ్యామల మధుకర్ నాయకులు పాల సురేశ్, రాజారపు నాగేందర్, కోల రాయమల్లు, మడిశెట్టి లక్ష్మణ్, పాల సత్యం, కొదురుపాక మల్లేశం, మంద బాబు, క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ సామల ప్రశాంత్, జంజూరు నవీన్, దాస గణేశ్, తీగల నవీన్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.