కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించిన సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లారపు అరుణ్ కుమార్
CPM: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 9 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కేంద్రంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లారపు అరుణ్ కుమార్ పత్రిక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్బంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ, వంట గ్యాస్ సిలిండర్ల ధరలను అమాంతం రూ.50 పెంచడాన్ని సీపీఐ(ఎం) పార్టీ తీవ్రంగా ఖండించింది. అలాగే పెట్రోల్, డీజిల్లపై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని విధించడాన్ని నిరసించింది. సాధారణ, సబ్సిడీయేతర కేటగిరీలకు చెందిన రెండు రకాల సిలిండర్ల ధరను రూ.50 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రజలపై దాదాపు రూ.7వేల కోట్ల భారం పడుతోంది. పైగా, పెట్రోల్, డీజిల్లపై రూ.32వేల కోట్లు మేరకు ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పటికే ప్రజల జీవితాలు భారంగా మారాయని, తాజాగా గ్యాస్ ధరల పెంపుతో ఇంకా తీవ్రమైన ప్రభావం పడనుందని విమర్శించిచారు. అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలను ప్రజలకు అందించడానికి బదులుగా ప్రభుత్వం ఆదనంగా భారాలు మోపుతోందని అన్నారు సమాఖ్య సూత్రాలను ఉల్లంఘించి, ప్రత్యేక ఎక్సైజ్ సుంకం పేరుతో అన్ని రకాల ఆదాయాలను తానే సమకూర్చు కోవాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొంది. ప్రభుత్వం తక్షణమే ఈ ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేల్లయ్య నరేందర్ తదితరులు పాలొన్నారు.