Congress Party: ఎల్లారెడ్డిపేట, మార్చి 15 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య శనివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లుకొని ప్రశాంతంగా పండగ చేసుకుంటున్న ప్రజల మధ్య ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. కనీసం పండగ పూట అని చూడకుండా మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునివ్వడం, దానికి వంత పాడుతూ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య తన అనుచరవర్గంతో దిష్టిబొమ్మ దహనానికి పాల్పడడం అవివేకమన్నారు. కనీసం పండగ పూట రంగులు చల్లుకొని నవ్వుతూ కేరింతలు కొడుతూ దిష్టిబొమ్మ దహనం చేయడం వారి అహంకారానికి నిదర్శనం అన్నారు. అసెంబ్లీ నుంచి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరగరాని నేరం జరిగినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాన్ని నిర్వహించడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అహంకారం ఇంకా తొలిగిపోలేదని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కె సాబేర బేగం, వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి, డైరెక్టర్లు గంట చిన్న లక్ష్మి, మెండె శ్రీనివాస్, సూడిద రాజేందర్, చెట్పల్లి బాలయ్య, తిరుపతిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు మర్రి శ్రీనివాసరెడ్డి, గంట బుచ్చయ్య గౌడ్, కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, కార్తీక్ గౌడ్, శ్రీనివాస్, బండారి బాల్ రెడ్డి, నంది కిషన్, గుర్రం రాములు, గుడ్ల శ్రీనివాస్, భూపాల్ రెడ్డి, రాజయ్య, ఎల్లగౌడ్, బాలు యాదవ్, రమేష్, ఇమామ్, కిషన్, మల్లారెడ్డి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.