ఇబ్రహీంపట్నం, మార్చి 15 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో అతిపురాతన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం మొదలు రాత్రి 12 గంటల వరకు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. యజ్ఞ అర్చకులు చక్రపాణి నర్సింహమూర్తిచార్యులు స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాలతో అభిషేకం చేసి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి రథయాత్ర కోసం బలిహరణం చేసి వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను రథంలోకి తిసుకోచ్చి రథబలి తదితర పూజలను వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల్లో స్వామి వారి రథయాత్ర కొనసాగింది. స్వామి వారు ఆలయానికి చేరిన తర్వాత అర్చకులు స్వామి వారి ఉత్సవమూర్తులతో నృత్యం చేశారు. అనంతరం పడిత సత్కరం జరిగింది. జాతర వేడుకలలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నరు. కార్యక్రమంలో దేవలయకమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
