బుగ్గారం, మార్చి 15 (మన బలగం): బుగ్గారం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దాదాసాహెబ్ కాన్షిరాం 91వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాన్షిరాం చిత్రపటానికి అంబేద్కర్ సంఘం నాయకులు దూడ లక్ష్మణ్, పోషరాజ్ పూలమాల వేసి, కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బహుజన నాయకులు దూడ తిరుపతి మాట్లాడుతూ పీడిత ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారానికి వచ్చినప్పుడు మాత్రమే బడుగు బలహీన వర్గాల బతుకుల్లో మార్పు వస్తుందని, అందుకోసం సబ్బండ కులాలను చైతన్య పరుస్తూ.. త్వరలో బహుజన రాజ్యాన్ని సాధించి, కాన్షీరాం కలలు కన్న స్వరాజ్యాన్ని సాధిద్దామని ప్రతిజ్ఞచేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు దూడ లక్ష్మణ్, డి.పోషరాజు, నక్క చంద్రమౌళి, నక్క రాజేందర్, అభిషేక్, వెంకటేశ్, చందు, రవితేజ, అనిల్, అంజి, పోచయ్య, రామన్న తదితరులు పాల్గొన్నారు.