Vivekananda Jayanti: జగిత్యాల ప్రతినిధి, జనవరి 12 (మన బలగం): భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి వివేకానందుడని, యువత మార్గదర్శిగా నిలిచిన వివేకానందుడి ఆశయాల సాధనకు కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వనమాల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం వివేకానంద జయంతిని పురస్కరించుకొని స్థానిక పెన్షనర్ భవన్‌లో వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందడి జీవితం నేటి యువతకు ఆదర్శం కావాలని అన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి వివేకానందుడని కొనియాడారు. కార్యక్రమంలో కోశాధికారి మెట్ట మల్లిఖార్జున్, యూనిట్ 1అధ్యక్షులు కొలిచాల రవీందర్, యూనిట్ 2 కార్యదర్శి కంటే అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు గంగారాం, కార్యదర్శి కమలాకర్రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ అశోక్ రావు, గంగాధర్, నర్సయ్య, మాజీ అధ్యక్షులు పెద్ది అనందం, రాజన్న, రఘుపతి తోపాటు పలువురు ఉన్నారు.