Awarding of prizes: ఇబ్రహీంపట్నం, జనవరి 12 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో వివేకానంద జయంతి సందర్భంగా మాజీ ఎంపీటీసీ పెంట లక్ష్మీ – లింబాద్రి సౌజన్యంతో వివేకానంద అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ టోర్నీలో 11 జట్లు పాల్గొన్నాయి. విజేతలుగా నిలిచిన విన్నర్ సున్నం రాకేశ్ జట్టు, రన్నర్ బర్కం నిఖిల్ జట్టులకు వివేకానంద జయంతి సందర్భంగా కప్పులు, బహుమతులు అందజేశారు. పలువురికి టోర్నీ కప్పులు షీల్డులు అందచేశారు. అనంతరం నిర్వాహకులను యువజన సంఘ సభ్యులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో యామపూర్ సహకార సంఘ చైర్మన్ అంకతి రాజన్న, నాయకులు సున్నం సత్యం, సేవాదళ్ మండల అధ్యక్షుడు నాంపల్లి వెంకటాద్రి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుమ్మల రమేశ్, బుర్రి ముత్యం, తరి రామానుజం, అరె రమేశ్, గుమ్మల నరేశ్, నిర్వాహకులు బర్కం నిఖిల్, అరె పవన్, యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.