International Meditation Day: ధర్మపురి, డిసెంబర్ 21 (మన బలగం): పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం అధ్యక్షుడు మామిడి శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. ధర్మారంలోని మొదటి పిరమిడ్ వ్యవస్థాపకులు గుంత భాస్కర్ సాయి కిరాణం పిరమిడ్ కేంద్రంలో ధ్యానం చేసారు. కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ జాయింట్ ట్రెజరర్, బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ సిరిపురం సత్యనారాయణ, పిరమిడ్ స్విరుచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ మాస్టర్ మెతుకు రమేశ్ బాబు, పతంజలి యోగా సమితి జంగిలి సుధాకర్ గురూజీ దంపతులు, శ్రీకృష్ణ అష్టంగా యోగా సమితి శిక్షకుడు ఇప్పలపల్లి సురేందర్ కార్యక్రమంలో మాట్లాడారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు మామిడి శెట్టి శ్రీనివాస్, ట్రెజరర్ తోడేటి మురళి గౌడ్, రీజనల్ చైర్మన్ తాళ్ల పల్లి సురేందర్ గౌడ్, జోన్ చైర్మన్ ఎలగందుల అశోక్, ముఖ్య అతిధులు మెతుకు రమేష్ బాబు మాస్టర్, పతంజలి యోగ సమితి జంగిలి సుధాకర్ గురూజీ దంపతులు, శ్రీ కృష్ణ అష్టాంగ యోగా శిక్షకుడు ఇప్పలపల్లి సురేందర్, పిరమిడ్ స్థాపకులు గుంత భాస్కర్, సీనియర్ ధ్యానులు బంగారు మాధవ్, ప్రభాకర్, అమరపల్లి మల్లేశం, భాస్కర్ టీచర్, యోగా సభ్యులు నాడెం శ్రీనివాస్, ఈగం ప్రసాద్, గౌడ శేఖర్, మల్యాల సత్యనారాయణ, మల్యాల శంకరయ్య, శ్రీనివాస్ టీచర్, గంగన్న, కమ్మరి రాజు, మల్లయ్య, శ్రీదర్, చెన్నబోయిన ప్రసాద్, కాంపల్లి మల్లేశం దంపతులు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.