- కుట్టు శిక్షణతో స్వయం ఉపాధి
- విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Whip Adluri Laxman Kumar: రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధికు నిరంతరం కృషిచేస్తోందని, మహిళా సాధికారతకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తోందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం న్యాక్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన, కార్మిక సంక్షేమ మండలి మహిళలకు వెల్గటూర్ మండలం గుల్లకోట గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సతీమణి కాంత కుమారితో కలిసి ప్రారంభించారు. అనంతరం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర భవన, కార్మిక సంక్షేమ మండలి ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రతి మహిళ వినియోగించుకోవాలని కోరారు.
ఈ కుట్టుమిషన్ శిక్షణకు సంబంధించి మహిళాలు తనను కలిసి శిక్షణ గదికి అద్దె చెల్లించే విషయంలో కొంత ఇబ్బంది ఉందని చెప్పిన వెంటనే గదికి సంబంధించిన అద్దె తానే స్వయంగా చెల్లించి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్స్‌తో పాటు కుట్టు మిషన్లు అందిస్తామని వెల్లడించారు. ఇప్పుడు 28 మంది మహిళలకు శిక్షణ పొందుతున్నారని, మరో విడతలో మరికొంత మందికి శిక్షణ ఇస్తామని తెలిపారు. శిక్షణ విషయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.