MP Dharmapuri Arvind
MP Dharmapuri Arvind

MP Dharmapuri Arvind: మున్నూరుకాపులు ఐక్యంగా ఉండాలి

  • ఎంపీ ధర్మపురి అరవింద్
  • బలం బలగం ఉన్నప్పుడే అన్ని సాధ్యమవుతాయి
  • ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
  • మున్నూరుకాపులకు అండగా ఉంటాం
  • ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • మున్నూరు కాపు సంఘ భవనానికి 30 లక్షల నిధుల మంజూరు
  • ఎమ్మెల్యే డాక్టర్ యం.సంజయ్ కుమార్

MP Dharmapuri Arvind: మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జగిత్యాల పట్టణ బండారి గార్డెన్లో ఆదివారం నిర్వహించగా నూతన అధ్యక్షులుగా చెదలు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఆమిరిశెట్టి కోశాధికారి కుంట సుధాకర్ ఉపాధ్యక్షులుగా బండారి శంకరయ్య పుప్పాల రాజేష్ చిన్నం తిరుపతి మహిళా ఉపాధ్యక్షురాలు వంగల కవిత రమేష్ సంయుక్త కార్యదర్శులుగా దేశెట్టి రాజారెడ్డి జక్కుల లింగారెడ్డి దొనకంటి గంగాధర్ మహిళా సంయుక్త కార్యదర్శిగా నవ లక్ష్మి మల్లయ్య న్యాయ సలహాదారుగా మారిశెట్టి ప్రతాప్ లు ప్రమాణ స్వీకారం చేశారు ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ యం సంజయ్ కుమార్ జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ లు విచ్చేశారు ఈసందర్భంగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలని ఐక్యంగా ఉన్నప్పుడే అన్ని సాధించుకోవచ్చు అని ఆన్నారు.

బలం బలగం ఉన్నప్పుడే ఏదైనా సాధించుకోవచ్చని ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు మున్నూరు కాపులు ఐక్యంగా ఉంటే అన్ని సాధించుకోవడం సాధ్యమవుతుందన్నారు బీసీ కార్పొరేషన్ కోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు విన్నవించడం జరిగిందని ప్రభుత్వం ఆదేశాగా అడుగులు వేస్తోందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో మున్నూరు కాపుల ఐక్యతతోనే తాను వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందాలని తెలిపారు. మనమందరం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన సత్తా ఏంటో నిరూపించాలన్నారు అనంతరం ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మున్నూరు కాపులకు అండగా ఉంటామని మున్నూరు కాపులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చునన్నారు

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ యం సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో గత ఎన్నికల్లో మున్నూరు కాపులు ఉన్న అన్ని వార్డులలో అత్యధిక మెజార్టీ వచ్చిందని దామోదర్ రావు సహకారంతో 30 లక్షల నిధులు సంఘ భవన అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు జగిత్యాల నియోజకవర్గం అన్ని గ్రామాలలో మున్నూరు కాపు కుల సంఘ భవనాల కు నిధులు మంజూరు చేయడం జరిగింధని మున్నూరు కాపు కుల సంఘ సభ్యులకు జిల్లా నియోజకవర్గ పట్టణ పరిధిలో అన్ని రకాలుగా రాజకీయ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు జగిత్యాల పరిధిలో మున్నూరు కాపుల పక్షాన అన్నివేళలా అండగా ఉంటానన్నారు జగిత్యాల లో అన్ని కుల సంఘాల అభివృద్ధి కోసం టిఆర్ నగర్ లో 17 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని కలెక్టర్ కూడా ఆర్డర్లు ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా నూతన అధ్యక్షులు చెదలు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆమిరిశెట్టి కోశాధికారి కుంట సుధాకర్, ఉపాధ్యక్షులుగా బండారి శంకరయ్య, పుప్పాల రాజేష్, చిన్నం తిరుపతి, మహిళా ఉపాధ్యక్షురాలు వంగల కవిత రమేష్ సంయుక్త కార్యదర్శులుగా దేశెట్టి రాజారెడ్డి, జక్కుల లింగారెడ్డి, దొనకంటి గంగాధర్, మహిళా సంయుక్త కార్యదర్శిగా నవ లక్ష్మి, మల్లయ్య, న్యాయ సలహాదారుగా మారిశెట్టి ప్రతాప్, బాదినేని రాజేందర్, కౌన్సిలర్ కూసరి అనిల్, పిట్ట ధర్మరాజు, కోలగాని ప్రేమలత, సత్యం, తోట మల్లికార్జున్ జిల్లా కార్యవర్గ సభ్యులు మున్నూరు కాపు సంఘ సభ్యులు కుల బాంధవులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *