Medical camp: నిర్మల్, జనవరి 4 (మన బలగం): నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాలలోని పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ఆరోగ్య జాగ్రత్తలు, చర్మ సంరక్షణ, అంటువ్యాధుల నివారణ తదితర అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించారు. టెలి మానస మానసిక ఆరోగ్య సమస్యల నివృత్తి కోసం 14416 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వంశీ, అరుంధతి, గోదావరి తదితరులు పాల్గొన్నారు.