Inspection of hospitals: మెట్పల్లి (ఇబ్రహీంపట్నం), నవంబర్ 5 (మన బలగం): జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులను మంగళవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సమియొద్దీన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రుల్లోని డాక్టర్ల వివరాలు, ఆస్పత్రి రిజిస్ట్రేషన్, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, బయోవేస్ట్ మేనేజ్మెంట్, రికార్డులు మొదలైన వాటిని పరిశీలించారు. సరైన నిబంధనలు పాటించని ఆస్పత్రులను పరిశీలించి వాటికి నోటీసులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అల్లాల అంజిత్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ కుతుబుద్దీన్, సూపర్వైజర్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.