India vs Ire, T20 World Cup 2024: టీ 20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్ (Ireland)ను ఇండియా (India) చిత్తు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్నాడు. అర్షదీప్, మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) నిప్పులు చెరిగే బంతులతో ఐరిష్ బ్యాట్స్‌మెన్స్‌పై ఆధిపత్యం చెలాయించారు.
బౌన్సర్లతో ఐరిష్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. ఐరిష్ ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్, బాల్బరిన్‌ను సింగిల్ డిజిట్‌కే అర్షదీప్ పెవిలియన్‌కు చేర్చగా.. బుమ్రా బౌలింగ్‌లో నిప్పులు చెరగడంతో ఐర్లాండ్ 50 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. డిలానే 2 సిక్సులు, 2 ఫోర్లతో 14 బంతుల్లోనే 26 పరుగులు చేయగా.. మిగతా బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేశారు. బుమ్రా మూడు ఓవర్లు వేసి కేవలం ఆరు పరుగులే ఇచ్చి ఒక మెయిడిన్‌తో పాటు రెండు కీలక వికెట్లు తీశాడు. దీంతో ఐర్లాండ్ 96 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
బ్యాటింగ్‌కు దిగిన ఇండియా విరాట్ కొహ్లి (Virat Kohli) ఒక్క పరుగుల మాత్రమే చేయగా.. 22 పరుగుల టీం స్కోరు వద్ద విరాట్ విరాట్ కొహ్లి అవుటయ్యాడు. రిషబ్ పంత్ (Rishabh Pant), ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి ఆరు ఓవర్లలో కేవలం 39 పరుగులు చేశారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఓపిగ్గా బ్యాటింగ్ చేయడంతో తర్వాత రన్స్ రావడం ఈజీ అయిపోయింది. పిచ్ డేంజర్‌గా ఉండటంతో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్స్‌కు గాయాలయ్యాయి.
రోహిత్ శర్మ 36 బంతుల్లోనే 57 పరుగులు చేసి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. చివరి రిషబ్ పంత్ 36 పరుగులు చేసి విన్నింగ్ షాట్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. సూర్య కుమార్ రెండు పరుగులకే అవుటయ్యాడు. పిచ్‌పై సీనియర్ క్రికెటర్లు విమర్శలు చేశారు. ఇది టీ20 వికెట్ మాత్రం కాదన్నారు. ఇలాంటి పిచ్‌లు టెస్ట్ క్రికెట్‌కు సరిగ్గా సరిపోతాయన్నారు.