మన బలగం, స్పోర్ట్స్ డెస్క్
IPL 2024 BUTLER: రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 224 రన్స్ ఛేజింగ్ లో 121 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో జట్టును గెలిపించాడు బట్లర్. మిగతా బ్యాటర్లందరూ పెవిలియన్ కు క్యూ కడుతుంటే క్రీజులో గోడలా నిలబడిపోయాడు. అంతేకాదు సెంచరీ చేసి రాజస్థాన్ కు మరుపురాని విజయాన్ని అందించాడు.
చివరి ఓవర్ లో 9 పరుగులు రావాల్సిన సమయంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో మొదటి బంతికే సిక్సు కొట్టి ప్రెషర్ రీలిప్ చేసుకున్నాడు. అనంతరం మూడు బంతులకు సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా.. తీయలేదు. అయిదో బంతికి టు రన్స్ చేసి స్కోరును సమం చేశాడు. అనంతరం చివరి బంతికి సింగిల్ తీసి రాజస్థాన్ కు గొప్ప విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్ చూసిన వారందరూ అసలు రాజస్థాన్ అలా ఎలా గెలిచిందబ్బా అని ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఎక్కడా కూడా తొణకకుండా కొండంత లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా.. బట్లర్ చూపిన తెగువ అసామాన్యం. ఇలా ఎలా ఆడగలిగారని పోస్టు మ్యాచ్ ప్రజేంటేషన్ లో అడిగితే నేను దోని, కోహ్లిల బ్యాటింగ్ ను చూశాను. వారికి మ్యాచ్ ను చివరి వరకు ఎలా తీసుకెళ్లాలో, ఎలా ముగించాలో తెలుసు. నేను కూడా వారినే ఫాలో అయ్యాను. చివరకు ఫలితం సాధించానని చెప్పాడు.
బట్లర్ ఆడిన ఈ గ్రేట్ ఇన్సింగ్స్ ఐపీఎల్ 16 వ సీజన్ లోనే బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక్కొక్కరు తన తోటి బ్యాట్స్ మెన్ క్యూ కడుతున్న కళ్లలో ఎక్కడా బెరుకు, భయం లేకుండా నింపాదిగా కొండంత లక్ష్యాన్ని ఛేధించేశాడు. చివరి బ్యాట్స్ మెన్ కు స్ట్రైక్ ఇవ్వకుండా తానే స్ట్రైక్ తీసుకుని మరీ ముగించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆప్స్ కు చేరువకు వచ్చేసింది. బట్లర్ ఇన్సింగ్స్ ను మాత్రం కోల్ కతా నైట్ రైడర్స్ మరిచిపోలేక పోతుంది. ఓటమి అనంతరం కోల్ కతా టీం ఓనర్ వచ్చి బట్లర్ ను కౌగిలించుకున్నాడంలే మామూలు విషయం కాదు.