విండీస్‌ను భయపెట్టిన పపువా న్యూగినియా
T20 World Cup 2024: విండీస్ పపువా న్యూ గినియా మధ్య గయానాలో జరిగిన మ్యాచ్‌లో విండీస్ చెమటోడ్చాల్సి వచ్చింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినియా 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. గినియా కెప్టెన్ అసద్ వాలా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ బాహు ఇద్దరు కలిసి మంచి పార్ట్ నర్ షిప్ నెలకొల్పారు. బహు ఆరు ఫోర్లు, ఒక సిక్సుతో 50 పరుగులు చేసి వరల్డ్ కప్‌లో మొదటి టీ 20 హాప్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. కెప్టెన్ అసద్ వాలా ఒక సిక్సు, రెండు ఫోర్లతో 22 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఇన్సింగ్స్ చివరిలో కిపిల్ డోరిగా.. వేగంగా 27 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. గినియా 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అండ్రీ రస్సెల్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి గినియాను అడ్డుకున్నారు.
ఛేజింగ్‌లో వెస్టిండీస్‌కు ఆదిలోనే ఓపెనర్ జాన్సన్ చార్లెస్ వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్ సున్నా పరుగులకే ఔటయ్యాడు. అనంతరం బ్రండెన్ కింగ్, నికోలస్ పూరన్ ఇద్దరు కలిసి గినియా బౌలర్లపై ఎటాక్ చేశారు. నికోలస్ 27 పరుగులు చేయగా.. బ్రండెన్ కింగ్ 34 పరుగులు ఇన్సింగ్స్‌ను చక్కదిద్దారు.వరుస విరామాల్లో నికోలస్ పూరన్, రావ్ మెన్ పావెల్, చార్లెస్ ఔట్ కావడంతో విండీస్ కష్టాల్లో పడింది. చివరకు 97 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. లో అప్పటి వరకు పపువా న్యూ గినియాదే ఆధిపత్యం కాగా.. 24 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన సమయంలో విండీస్ బ్యాటర్లు మాయ చేశారు. రసెల్, చేజ్ ఒక్కసారిగా గేర్ మార్చి ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే 137 పరుగుల ఛేజింగ్ చేసేశారు. ఒకానొక దశలో గినియా బౌలర్ల దాటికి రన్స్ చేయడమే విండిస్ బ్యాటర్లకు కష్టమైపోయింది.