Kajal Aggarwal: కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్-2 మూవీ ఆడియో ఫంక్షన్ శనివారం రాత్రి చైన్నైలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్‌తోపాటు ప్రముఖ నటీ నటులు హాజరయ్యారు. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఎట్టకేలకు సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. జూల్ 12వ తేదీన మూవీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించింది. డైరెక్టర్ శంకర్ ఇండియన్-2 మూవీతోపాటు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘గేమ్ చేంజర్’ మూవీకి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్-2 సినిమాను తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ వర్క్‌లో మూవీ టీమ్ బిజీగా ఉంది. అయితే శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ శంకర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ నిరాశలో పడేసింది.
ఇండియన్-2 మూవీలో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీ రోల్‌లో యాక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాజల్ పాత్ర గురించి డైరెక్టర్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాజల్ నటించిన సన్నివేషాలు ఈ మూవీలో కాకుండా ఇండియన్ -3 సినిమాలో ఉంటాయని స్పష్టం చేశారు. దీంతో కాజల్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. వివాహ బంధంలోకి అడుగిడిన తరువాత చాలా కాలం మూవీస్‌కు దూరంగా ఉన్నారు కాజల్. త్వరలో రిలీజ్ కానున్న ఇండియన్-2 మూవీలో కాజల్‌ను చూడొచ్చని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది షాకింగ్‌గా మారింది. ఈ సినిమాలో కాజల్ సీన్స్ ఉండవని తెలియడంతో అభిమానులు తీవ్ర నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు.
అప్పట్లో సూపర్ హిట్ అయిన భారతీయుడు సినిమాకు కొనసాగింపుగా ఇండియన్-2 సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా మూవీ నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో ఎస్‌జే సూర్య, వివేక్, ప్రియాభవానీ శంకర్, సముద్రఖని, బాబీ సింహా కీ రోల్స్ పోషిస్తున్నారు. అనిరుధ్ రవి చందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.