- 144 పరుగులు చేసిన ముంబై
- ఛేదనలో చెమటోడ్చిన ఎల్ఎస్‌జీ
- 4 వికెట్ల తేడాతో విజయం
LSG vs MI, IPL 2024: ఐపీఎల్ సీజన్ 2024లో ముంబైపై లక్నో విజయం సాధించింది. తక్కువ స్కోర్ చేసిన ముంబై చివరి వరకు పోరాడింది. 144 పరుగుల లక్ష్యంతో బరిగిలోకి దిగిన లక్నోకు విజయం సులువుగా లభించలేదు. లక్నో బ్యాటర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. చివరి ఓవర్ వరకు సాగిన మ్యాచ్‌లో లక్నో విజయాన్ని అందుకుంది. లక్నో బ్యాటర్ స్టొయిన్ 62 పరుగులతో విరుచుకుపడ్డాడు.
ఎల్ఎస్‌జీ, ఎంఐ మ్యాచ్ లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పాయి స్టేడియంలో మంగళవారం జరిగింది. లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 144 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, నబీ 10 పరుగుల కన్నా తక్కువ స్కోర్ మాత్రమే చేసి ఔట్ అయ్యారు. హార్దిక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ 32, నెహాల్ వధేరా 46, టిమ్ డేవిడ్ 35 మాత్రమే చెప్పుకో దగ్గ స్కోర్ చేసారు. ముంబై 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది.
లక్నో బౌలర్లలో మోసింఖాన్ 2, స్టోయినిస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, తలో వికెట్ తీసుకున్నారు. ముంబై టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. లక్నో బౌలర్ల ధాటికి ముంబై బ్యాటర్లు చేతెలెత్తేసారు.
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆచితూచి ఆడింది. ఓపెనర్లు కెప్టెన్ కేఎల్ రాహుల్ 28, అర్షిన్ కులకర్ణి డకౌట్ అయ్యాడు. తరువాత బ్యాటింగ్‌కు దిగిన స్టోయినిస్, దీపక్ హుడా ఆచితూచి ఆడారు. దీపక్‌హుడా 18 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మర్కస్ స్టొయినీస్ 62 పరుగులు (7 ఫోర్లు, 2 సిక్సులు) చేసి నబీ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి 5వ వికెట్‌గా వెనుదిరిగాడు. 12 బాల్స్‌లో 13 పరుగులు కావాల్సిన సమయంలో బదోని (6) రనౌట్‌గా వెనుదిరిగాడు.