Virat Kohli: రన్ మెషీన్ విరాట్ కొహ్లి ఇప్పటి వరకు ఆడిన వరల్డ్ కప్ టీ 20 మ్యాచుల్లో 1141 పరుగులు చేయగా.. 7 హాప్ సెంచరీలు చేశాడు. 28 సిక్సులు బాదాడు. టీ 20 ఓవరాల్ మ్యాచుల్లో 4 వేలకు పైగా రన్స్ చేసిన విరాట్ 15 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు అందుకున్నాడు. కేవలం టీ 20ల్లోనే ఎక్కువ రన్స్ చేయడం అది కూడా ఛేజింగ్‌లోనే తన సత్తా చాటడంతో ప్రస్తుతం అందరి చూపు విరాట్ కొహ్లి పైనే ఉంది.
అయితే అమెరికాలోనే ఐదు లీగ్ మ్యాచులు ఇండియా ఆడనుంది. గతంలో ఫ్లోరిడాలో వెస్టిండీస్‌తో ఆడిన అనుభవమున్న భారత్‌కు ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో మ్యాచులు ఆడటం సరికొత్త విషయం. ఇప్పటికే టీం ఇండియా ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. యశస్వి జైశ్వాల్, సిరాజ్ నెట్స్‌లో చెమటోడ్చుతున్న వీడియోలు బయటకు వచ్చాయి.
అమెరికాలోని న్యూయార్క్‌లో జూన్ 1న ఇండియా బంగ్లాదేశ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను కూడా తాము సీరియస్‌గానే తీసుకుంటామని ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. ఈ సారి వరల్డ్ కప్ గెలిచి 17 ఏండ్ల కోరిక తీర్చాలని కోరుకుంటున్నారు. దీంతో పాటు వరల్డ్ కప్ గెలిచి టీ 20 లకు గుడ్‌బై చెప్పాలని రోహిత్, కొహ్లి అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సరికొత్త పిచ్‌లు ఎవరికీ సొంత గడ్డ కాదు. ఐదు లీగ్ మ్యాచులు కూడా అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనుండటంతో ఇండియానే హట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ వెస్టిండీస్‌కు వచ్చే సరికే అసలు సమస్య రానుంది. వెస్టిండీస్‌లో ఇండియాకు పెద్దగా అచ్చొచ్చిన స్టేడియాలు, మ్యాచులు కానీ ఇంత వరకు లేవు.