Pat Cummins: సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం నమోదు చేయగా.. సన్ రైజర్స్ క్వాలిఫయర్ వన్ మ్యాచ్ ఆడేందుకు అర్హత సాధించింది. సన్ రైజర్స్ టీంను ప్రస్తుతం ప్యాట్ కమిన్స్ నడిపిస్తున్నాడు. సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మకు బౌలింగ్ చేయాలనుకోను.. ఎందుకంటే అతడు ఎలాంటి బౌలర్ పైన అయినా ఎదురు దాడికి దిగగల సామర్థ్యం ఉందని ప్యాట్ కమిన్స్ అన్నాడు.
సన్ రైజర్స్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో టీం క్వాలిఫయర్‌కు చేరుకుంది. అయితే ఈ సారి అభిషేక్ శర్మ సిక్సులతో విరుచుకుపడుతున్నాడు. ఇప్పటికే 40 సిక్సుల వరకు బాదాడు. సిక్సులు, ఫోర్లు అలవోకగా బాదేస్తూ ప్రత్యర్థి బౌలర్లపై ప్రతాపం చూపుతున్నాడు. అయితే అభిషేక్ శర్మ స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా సిక్సులు ఫోర్లతో దంచికొడుతూ.. భీకర ఫామ్‌లో ఉన్నాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సారి రెచ్చిపోయి ఆడుతోంది. ఉప్పల్‌లో ఇప్పటికే ఆరు విజయాలు సాధించింది. నితీశ్ రెడ్డి, సన్వీర్ సింగ్ లాంటి యువ బ్యాటర్లు కూడా సన్ రైజర్స్ టీంకు బలంగా మారిపోయారు. అభిషేక్ శర్మ ఇప్పటికే 469 పరుగులు చేశాడు. అయినా టీం ఇండియాకు సెలక్టు కాకపోవడంతో చాలా మంది అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్లు సైతం టీం ఇండియా సెలక్టర్ల తీరుపై మండిపడుతున్నారు.
గత మూడు సీజన్లలో దాదాపు పాయింట్స్ టేబుల్స్‌లో లాస్ట్ స్థానంలో నిలిచింది. కానీ ఈ సారి కెప్టెన్ మార్పు, ప్లేయర్ల రాణింపుతో అనేక రకాలుగా కలిసివస్తోంది. దీంతో టైటిల్ రేసులో సన్ రైజర్స్ నిలిచింది. ఈ టోర్నీ చాలా టఫ్‌గా నడిచింది. లక్నో, ఢిల్లీ, ఆర్సీబీ, చెన్నై నాలుగు టీంలు 14 పాయింట్స్‌తో ఉండగా.. మెరుగైన రన్ రేట్‌తో ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.