Kavya Maran SRH: కావ్య మారన్ వేల కోట్ల అధిపతి అయిన కళానిధి మారన్ కూతురు. దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన సన్ టీవీకి కావ్య మారన్ వారసురాలు. 1992 సంవత్సరం ఆగస్టు 6న జన్మించిన కావ్య ఇంకా పెళ్లి చేసుకోలేదు. కావ్య బాయ్ ఫ్రెండ్స్ గురించి కొన్ని రూమర్స్ వచ్చినా.. అవి అన్నీ పుకార్లే అని తేలిపోయాయి. కావ్య ఇంగ్లండ్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్‌లో ఏంబీఏ చదివింది. సన్ రైజర్స్ టీం కంటే ముందు, సన్ మ్యూజిక్, ఎఫ్ఎం మ్యూజిక్‌లో కావ్య పని చేసింది.
2024 ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన వేలంలో ఆమె కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆసీస్ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్‌ను రూ.20.50 కోట్లు పెట్టి కొనుగోలు చేయడంతో చాలా మంది ఆమెను విమర్శించారు. కానీ పదో స్థానంలో ఉన్న జట్టును ఫైనల్‌కు చేర్చడంతో ఈ ఆసీస్ క్రికెటర్ సక్సెస్ అయ్యాడు. కావ్య కోట్ల రూపాయలకు వారసురాలైనా ఆమె మనసు ఎంతో మంచిదని చాలా మంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కావ్య మారన్‌కు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరని, కానీ ఆమె తల్లిదండ్రుల కంటే గొప్ప మనుసున్న వ్యక్తి అని చెబుతున్నారు. కావ్య మారన్ సౌతాఫ్రికాలో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టౌన్ అనే జట్టును కొనుగోలు చేసి రెండు సార్లు టైటిల్‌ను ముద్దాడింది. ఇక్కడ కూడా ఎలాగైనా కప్ కొట్టాలని భావించిన కావ్య తన టీం ఫైనల్‌లో ఓడిపోవడంతో కన్నీటి పర్యంతమైంది.
ఆ తర్వాత సన్ రైజర్స్ టీం ప్లేయర్లతో మాట్లాడి వారిని ఓదార్చింది. మీరు ఈ సీజన్‌లో గొప్పగా ఆడారు. మీ ముఖాలపై ఎప్పుడూ చిరునవ్వు మాత్రమే ఉండాలని, ఇలా నిరాశ ఉండటం చూడకుండా ఉండలేకపోతున్నాని చెప్పింది. దీంతో నెటిజన్లు ఆమెను అమాంతం ఆకాశానికెత్తెస్తున్నారు. సన్ రైజర్స్ ఫ్యాన్స్ కావ్య మారన్ మంచి మనుసు గురించి పొగడకుండా ఉండలేకపోతున్నారు.