- కొనసాగిన స్పిన్నర్ల హవా
- 156 పరుగులు చేసిన భారత్
NZ vs IND: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆల్‌ఔట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 156 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ బౌలర్ల స్పిన్ మాయాజాలానికి భారత్ అత్యల్ప స్కోరుకే కుప్పకూలింది. యశస్వి జైస్వాల్ 30, శుభ్‌మన్ గిల్ 30, జడేజా 38 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లు 20 లోపు స్కోరుకే ఔట్ అయ్యారు. రోహిత్, బుమ్రా సున్నా పరుగులకే ఔట్ అయ్యారు. కొహ్లి 1, అశ్విన్ 4, కుల్దీప్ 6, సర్ఫరాజ్ 11 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్ సాంట్నర్ ధాటికి భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఏ దశలోనూ భారత్ కోలుకోలేకపోయింది. 19.3 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. ఫిలిప్స్ 2, సౌథీ 1 వికెట్ తీసుకున్నారు. దీంతో భారత్ 156 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసింది. 126 పరుగుల లీడ్‌తో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.