Protest: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, జనవరి 31 (మన బలగం): అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఇంజనీర్స్ శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రెసిడెంట్ వెంకట రెడ్డి, సెక్రెటరీ బొల్గం సాగర్, కోశాధికారి విశ్వాన్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ (ఇంట్ర), అగ్రహారం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల మిషన్ భగీరథ ఏఈఈ సాయి చరణ్ కనీసం 6 నెలలు కూడా గడవక ముందే ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ ఉన్నతాధికారులు వెంటనే విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయిచరణ్ ఆత్మకుశాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో జిల్లాలో పనిచేస్తున్న అన్ని ఇంజనీరింగ్ విభాగాల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారులు పాల్గొన్నారు.