Renuka Yellamma: బొమ్మకల్ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా శ్రీ రేణుక మాతను గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ నాయకులు దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ మాట్లాడుతూ రేణుకా మాత ఆశీస్సులు ప్రతి ఒక్క గౌడ బిడ్డకు ఉండాలని, ఆ తల్లి ఆశీర్వాదం తోటి సుఖశాంతులు ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, నిండు నూరేళ్లు కలకాలం జీవించాలని ప్రార్థించారు. ఎంతో నిష్టతో చేసే రేణుకా మాత బోనాల కార్యక్రమాలు బొమ్మకల్ గ్రామంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం రేణుకా మాత ఆశీర్వాదంతో గౌడ కులస్తులు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలు అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో కరీంనగర్ మండలం అధ్యక్షులు బుస శ్రీనివాస్ గౌడ్, తిమ్మాపూర్ మండలం అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడ్, మానకొండూర్ నియోజకవర్గం ఇన్‌చార్జి గోపాగోని నవీన్ గౌడ్, బొమ్మకల్ గ్రామ గౌడ సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.