SL vs BAN, T20 World Cup 2024: శ్రీలంక (Sri Lanka), బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య డల్లాస్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న బంగ్లా బౌలర్లపై లంక ఓపెనర్ పథూమ్ నిస్సంకా.. 28 బంతుల్లోనే 47 పరుగులు చేసి బెంబెలేత్తించాడు. కానీ మిడిలార్డర్ బ్యాట్‌మెన్స్ చేతులెత్తేయడంతో 20 ఓవర్లలో 124/9 వికెట్లతో ఇన్సింగ్స్ ముగించింది.
బంగ్లా బౌలర్లలో రిషద్ హోసెన్, ముస్తాపిజుర్ రెహమన్ మూడేసి వికెట్లు తీశారు. లంక బ్యాట్స్ మెన్‌ను పరుగులు చేయకుండా కట్టడి చేశారు. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఓపెనర్లను లంక బౌలర్లు 0, 3 పరుగులకే పెవిలియన్‌కు పంపగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో కూడా 7 పరుగులకే ఔటయ్యాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ 36 పరుగులు, మిడిలార్డర్ బ్యాటర్ హృదోయ్ 20 బంతుల్లోనే నాలుగు సిక్సులు, ఒక ఫోర్‌తో 40 పరుగులు చేసి బంగ్లాను విజయానికి చేరువగా తెచ్చిన చివర్లో ఇద్దరు ఔట్ కావడంతో ఉత్కంఠ నెలకొంది.
లంక బౌలర్లలో నువాన్ తుషార నాలుగు వికెట్లు, వహిందు హసరంగా రెండు వికెట్లు తీశారు. మొదటి ఇన్సింగ్స్‌లో కేవలం 124 పరుగులు చేయడంతో ఓటమి నుంచి లంక తప్పించుకోలేకపోయింది. బంగ్లా చివరి బ్యాటర్లు సమయోచితంగా ఆడి విజయాన్ని అందించారు. 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోగా.. బంగ్లా సీనియర్ బ్యాటర్ మహ్మదుల్లా 13 పరుగులతో తీవ్ర ఒత్తిడిలో కూడా మ్యాచ్ గెలిపించాడు.
బంగ్లాదేశ్ విజయంతో పాయింట్ల పట్టికలో బోణి కొట్టగా.. ఇప్పటికే సౌతాఫ్రికాతో ఓడిపోయిన శ్రీలంక, బంగ్లాతో ఓటమితో సూపర్ సిక్సు దశకు చేరుకోవడం కష్టతరంగా మారింది. రాబోయే మ్యాచుల్లో నెదర్లాండ్స్, నేపాల్‌తో గెలిచినా మిగతా జట్ల బలబలాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కొత్త కెప్టెన్‌గా వహిందు హసరంగాను సెలెక్ట్ చేసినా లంక తీరు ఏ మాత్రం మారలేదు. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ సూపర్ 8లో స్థానం కోసం పోటీ పడుతున్నాయి.