Sandeep Lamichhane: నేపాల్ క్రికెట్ టీం సభ్యుడు సందీప్ లామిచెనేకు యూఎస్ క్రికెట్ బోర్డు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. సందీప్ లామిచెనె గతంలో ఓ రేప్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే ఖాట్మాండులోని కోర్టు సందీప్ లామిచెనేకు వీసా ఇవ్వడం కుదరదని చెప్పింది. దీంతో 15 మంది సభ్యులతో నేపాల్ వెళ్లాల్సిన టీంలో సందీప్ లామిచెనే వెళ్లలేకపోయాడు.
అయితే నేపాల్‌లో క్రికెట్ చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ 20 వరల్డ్ కప్‌లో 20 జట్లు పాల్గొననున్నాయి. ఇందులో ఈసారి నేపాల్ జట్టు అర్హత సాధించింది. కానీ 15 మంది జట్టు సభ్యుల్లో సందీప్ లామిచెనే ఉండగా.. యూఎస్ ఎంబసీ వీసా ఇవ్వడానికి నిరాకరించిందని సందీప్ లామిచెనే తన ఫేస్ బుక్ హ్యాండిల్‌లో పోస్టు చేశాడు.
నేపాల్‌లో ఉన్న అమెరికా ఎంబసీ వారు సందీప్‌కు వీసా ఇవ్వకపోవడం పట్ల చింతిస్తున్నాము. కానీ అమెరికా రూల్స్ ప్రకారం.. కొన్ని నిబంధనలు అనుసరించి సందీప్‌కు వీసా ఇవ్వలేకపోతున్నామని ప్రకటించింది. అయితే చిన్న దేశాల్లో క్రికెట్ విస్తరించేందుకు ఐసీసీ చేపట్టిన ప్రోగ్రాం సక్సెస్ అవుతోంది. ఆఫ్గనిస్తాన్, నేపాల్ లాంటి దేశాలు క్రికెట్ వైపు మళ్లడమే కాకుండా యూఎస్ సైతం ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఆతిథ్య దేశంగా అర్హత సాధించింది. ఇంత పెద్ద టోర్నీలో ఆడడానికి అవకాశం వచ్చినా.. యూఎస్ వీసా తిరస్కరణతో సందీప్ లామిచెనే పాల్గొనేది లేనేది ఇంకా తెలియడం లేదు.